Kishan Reddy: సైనికులు దేశ గౌరవాన్ని పెంచారు
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:44 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా మన సైనికులు, భద్రతా సిబ్బంది వీరోచిత పోరాటంతో దేశ గౌరవాన్ని పెంచారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తిరుమల/న్యూఢిల్లీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా మన సైనికులు, భద్రతా సిబ్బంది వీరోచిత పోరాటంతో దేశ గౌరవాన్ని పెంచారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం సుప్రభాత సేవలో కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రక్షణలో అంకిత భావంతో పనిచేస్తున్న సైనికులకు అండగా ఉండాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్టు తెలిపారు.
కాగా, అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలోని రైల్వేస్టేషన్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయని కిషన్‌రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. అమృత్ భారత్‌లో భాగంగా అభివృద్ధి చేస్తున్న మహబూబాబాద్ రైల్వేస్టేషన్ చిత్రాలను ఆయన పోస్ట్ చేశారు. రూ.26.49 కోట్లతో స్టేషన్ ఆధునీకరణ చేపట్టగా ఇప్పటి వరకు 92 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.