Share News

Operation Sindoor: పాక్‌ అబద్ధాలకు రాహుల్‌ ప్రచారం:కిషన్‌రెడ్డి

ABN , Publish Date - May 20 , 2025 | 04:08 AM

ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని అభినందించాల్సింది పోయి రాహుల్‌ గాంధీ పాకిస్థాన్‌ చెబుతున్న అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Operation Sindoor: పాక్‌ అబద్ధాలకు రాహుల్‌ ప్రచారం:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని అభినందించాల్సింది పోయి రాహుల్‌ గాంధీ పాకిస్థాన్‌ చెబుతున్న అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మన సైనికులకు దేశం మొత్తం అభినందనలు తెలుపుతున్న సమయంలో, రాహుల్‌ మాత్రం దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.


ప్రధాని మోదీ తీసుకున్న తక్షణ, కఠిన చర్యల ఫలితంగా పాకిస్థాన్‌.. భారత్‌ కాళ్ల మీద పడిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచమంతా భారత్‌ విజయాన్ని గుర్తిస్తుంటే.. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పాకిస్తాన్‌కు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘రాహుల్‌, కాంగ్రెస్‌ ఈ చిల్లర రాజకీయాలను వదిలి దేశానికి అండగా నిలబడగలరా..? ఆయన ఇప్పటికైనా మారతారా..? లేదా వారి నుంచి దేశభక్తిని ఆశించడం అత్యాశేనా?’’ అంటూ కిషన్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - May 20 , 2025 | 04:08 AM