Kishan Reddy: మిర్చి రైతులకు అండగా తెలంగాణలోనూ మార్కెట్ జోక్యం: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - May 09 , 2025 | 03:33 AM
తెలంగాణ మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో నాలుగో వంతు మిర్చి పంటకు మార్కెట్ జోక్యం పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీ, మే 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో నాలుగో వంతు మిర్చి పంటకు మార్కెట్ జోక్యం పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ప్రకటించారు. ఆ పథకంలో భాగంగా మిర్చి ధరను రూ.10,374 గా నిర్ధారించినట్లు తెలిపారు. ఆ ధర కంటే మార్కెట్ ధర ఎంత తక్కువైతే అంత మొత్తాన్ని మొదట రాష్ట్రప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందని తెలిపారు. ఈ విషయంపై తాను గత నెల 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మిర్చిని పండించేందుకు అయిన ఖర్చు కంటే మార్కెట్ ధర తక్కువగ ఉన్నప్పుడు ఈ పథకం ద్వారా రైతులను లబ్ది చేకూరుతుందని కిషన్‌రెడ్డి అన్నారు.