Share News

Kharif season: ఖరీఫ్ కు యూరియా కొరత

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:28 AM

ఈ వానాకాలం (ఖరీఫ్) ప్రయోజనాల కోసం యూరియా సహా ఇతర ఎరువుల డిమాండ్ రూ. 9.8 లక్ష మే., కానీ ఏప్రిల్–మేలో కేంద్రం కేటాయించిన కూడా కోటాలోనకే సరఫరా చేసింది, దీంతో ప్రస్తుతం దాదాపు 1.72 లక్ష మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా ఉంది

Kharif season: ఖరీఫ్ కు  యూరియా కొరత

ఈ సారి 9.8లక్షల టన్నుల అవసరం

అందుబాటులో 3.78 లక్షల టన్నులే

మిగతా ఎరువుల సరఫరా.. అంతంతే

సరిపడా ఇవ్వాలని కేంద్రానికి తుమ్మల లేఖలు

హైదరాబాద్‌, జూన్‌ 7(ఆంధ్రజజ్యోతి): వానాకాలం (ఖరీఫ్‌) పంటల సీజన్‌ వచ్చేస్తోంది. రాష్ట్రంలో మాత్రం యూరియా సహా ఇతర ఎరువులకు తీవ్ర కొరత నెలకొంది. రాష్ట్రానికి కోటా మేరకు ఎరువులను కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లే ఈ సమస్య నెలకొంది. ఏప్రిల్‌, మే నెలల్లో చేసిన ఎరువుల సరఫరాలోనూ కేంద్రం కోత విధించింది. ఫలితంగా ఖరీఫ్‌ సమీపిస్తుండటంతో ప్రధానంగా యూరియా విషయంలో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ప్రస్తుత వానాకాలం సీజన్‌ కోసం 9.8 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ఇంతే నిల్వను కేంద్రం కేటాయించింది. అయితే ఏప్రిల్‌లో సరఫరా చేయాల్సిన 1.7లక్షల టన్నుల్లో 1.22లక్షల టన్నులు, మే నెలలో రావాల్సిన 1.6లక్షల టన్నుల్లో.. కేవలం 94 వేల టన్నులనే సరఫరా చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి సరఫరాచేసింది 2.08 లక్షల టన్నుల యూరియానే. నిరుడు ఇదే సమయానికి రాష్ట్రంలో 5.5లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 3.78లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే దాదాపు 1.72లక్షల టన్నుల యూరియా తక్కువగా ఉంది. ఇప్పటికే 0.58లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఇంకా 6.02 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. డీఏపీ 2.40లక్షల టన్నులు అవసరం ఉండగా, ఇప్పటివరకు 0.90 లక్షల టన్నులే అందుబాటులో ఉంది. ఇందులో 0.21 లక్షల టన్నులు ఇప్పటివరకు అమ్ముడైంది. గణాంకాల ప్రకారం డీఏపీకి 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కొరత ఉంది. కాంప్లెక్స్‌ ఎరువులు 10లక్షల టన్నులు అవసరంకాగా, కేవలం 3.61 లక్షల మెట్రిక్‌ టన్నులే అందుబాటులో ఉన్నాయి.. మరో 6.39 లక్షల టన్నులు కావాల్సి ఉంది. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కేంద్రమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వానాకాలం సీజన్‌కు కేటాయించిన ఎరువులను.. కోటా మేరకు పంపడంలేదని, ఇది వ్యవసాయ అవసరాలకు సరిపోదని తెలుపుతూ కోటా ప్రకారం రాష్ట్రానికి ఎరువులను పంపాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం గడిచిన రెండు నెలలుగా పంపిన ఎరువుల సరఫరాలో కోత విధించడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 04:28 AM