Palamuru-Rangareddy Project: కాంగ్రెస్‌ది నాటి నుంచీ తెలంగాణకు ద్రోహమే: KCR
ABN , Publish Date - Dec 26 , 2025 | 09:02 PM
మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. 29న శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రోజు (శుక్రవారం) పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ ది నాటి నుంచీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమే. తెలంగాణను బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీ పట్టించుకోవటం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందే. ప్రజల్లోకి వెళ్దాం... ఉద్యమాన్ని నిర్మిద్దాం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదాం’ అని పార్టీ నేతలకు చెప్పారు. కాగా, అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. 29న శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..