Veligonda Project: 2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Dec 26 , 2025 | 08:36 PM
వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్ట్ సీఈ, ఎస్‌ఈ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్ట్ సీఈ, ఎస్‌ఈ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. ‘7 కి.మీ టన్నెల్-2 లైనింగ్ పనుల్లో నేటికి 3.2 కి.మీ పూర్తైంది. డిసెంబర్‌లో 456 మీటర్ల లక్ష్యానికి గానూ,432 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశాం. మిగిలిన 3.6 కి.మీ లైనింగ్ 2026 జూన్ కల్లా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించాం.
టన్నెల్-2లో చిక్కుకొని ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగించడానికి నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. నివేదిక ప్రకారం టన్నెల్-2లో ఉన్న టీబీఎంను తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టి, సీజన్ ముగిసేలోగా పూర్తి చేయాలని అధికారులకు, ఏజెన్సీకి ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యంగా పర్యవేక్షణ జరుగుతోంది’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..
పెను విషాదం.. చావులోనూ వీడని స్నేహ బంధం..