Kavithas Suspension Welcomed: కవిత ఉంటే ఎంత.. పోతే ఎంత
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:31 AM
తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బీఆర్‌ఎ్‌సను ఉంటే ఎంత.. పోతే ఎంత అని కవిత పేర్కొనడం బాధాకరం. అటువంటి వ్యక్తి పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత? అని కార్యకర్తలు భావిస్తున్నారు’’ అని బీఆర్‌ఎస్ మహిళా నేతలు..
ఆమె పార్టీ పెడితే బీఆర్‌ఎ్‌సకు నష్టమేమీ లేదు
తన ప్రవర్తనతో తనకు తానే గొయ్యి తవ్వుకున్నారు
పార్టీకి ద్రోహం చేసిన వారిలా మిగిలిపోతున్నారు
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. బీఆర్‌ఎస్ మహిళా నేతల వ్యాఖ్యలు
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బీఆర్‌ఎ్‌సను ఉంటే ఎంత.. పోతే ఎంత అని కవిత పేర్కొనడం బాధాకరం. అటువంటి వ్యక్తి పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత? అని కార్యకర్తలు భావిస్తున్నారు’’ అని బీఆర్‌ఎస్ మహిళా నేతలు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ మహిళా నేతలు సత్యవతి రాథోడ్, గొంగిడి సునీత, మాలోత్ కవిత మీడియాతో మాట్లాడారు. గత మూడు నెలల్లో కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో అసహనానికి దారి తీశాయన్నారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కవితకు ఎంపీగా, ఎమ్మెల్సీగా ఎన్నో అవకాశాలు ఇచ్చారని, కానీ ఆమె ఆ గుర్తింపు నిలబెట్టుకోలేక పోయారని పేర్కొన్నారు. పార్టీ కంటే తానే ముఖ్యమనే విధంగా ఆమె మాట్లాడటంతో కార్యకర్తలు కూడా విసిగిపోయారని చెప్పారు. కవిత కొత్త పార్టీపెడితే బీఆర్‌ఎ్‌సకు కలిగే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు కేసీఆర్‌ను విభేదించి పెట్టిన కొత్తపార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. కేసీఆర్‌ను కవిత నాన్న అని పిలుస్తారేమోగానీ.. తెలంగాణ ప్రజలంతా ఆయన్ను బాపు (తండ్రి)గా భావిస్తున్నారని, ఆయన కూడా తెలంగాణ ప్రజలను కన్నబిడ్డల్లా భావిస్తారని పేర్కొన్నారు. పార్టీకి ద్రోహంచేసిన వారిలో కవిత కూడా ఒకరిగా మిగిలిపోవడం బాధాకరమన్నారు. పార్టీలో ఆమెకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని, తన ప్రవర్తనతో తనకు తానే గొయ్యి తవ్వుకున్నారని విమర్శించారు. ఎవరో చెబితే తాను మాట్లాడటం లేదని కవిత చెప్పింది అబద్ధమని.. ఎవరో ఆమె భుజం మీద తుపాకీపెట్టి ఎవరో కాలుస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, కన్న కుమార్తె కంటే కూడా కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. కవిత సస్పెన్షన్ సమంజసమేనని బీఆర్‌ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలకు ఎమ్మెల్సీ కవిత బలయ్యారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత వ్యాఖ్యలు పార్టీని గాయపర్చేలా ఉండటంతోనే కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు. కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టి పార్టీని చీల్చాలని కాంగ్రెస్, బీజేపీ కుట్రపన్నాయని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. పార్టీకి నష్టం చేస్తుంటే ఉపేక్షించకూడదనే కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఉద్యమ నేత అయిన కేసీఆర్‌కు కుమార్తె కంటే పార్టీ కార్యకర్తలే ముఖ్యమని తేలిందని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎవరు క్రమశిక్షణ తప్పినా చర్యలు తప్పవని కేసీఆర్ నిరూపించారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రె్‌సతో కవిత లోపాయకారీ ఒప్పందం చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి బీఆర్‌ఎస్ కార్యాలయంలో కవిత ఫ్లెక్సీలు, పోస్టర్లను కార్యకర్తలు చింపివేశారు.
ఇవి కూడా చదవండి..
దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..
ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..