Share News

Kavitha: బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతివ్వాలి

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:36 AM

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్యను కోరారు.

Kavitha: బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతివ్వాలి

  • ఎంపీ ఆర్‌.కృష్ణయ్యను కోరిన ఎమ్మెల్సీ కవిత

  • కవిత పోరాటం అభినందనీయం: కృష్ణయ్య

హైదరాబాద్‌/రాంనగర్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యో తి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్యను కోరారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా 42ు రిజర్వేషన్లపై మద్దతుతో పాటు జూలై 17న జరిగే రైల్‌రోకోకు సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


స్థానిక ఎన్నికలపై మంత్రులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. బీసీల కోసం పోరాడేందుకు ఎవరు ముందుకు వచ్చిన రాజకీయాలకతీతంగా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, తెలంగాణ జాగృతిలో ’యూనిటీ’ ఆటో డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విలీనమయ్యింది. ఆదివారం కవిత నివాసంలో అసోసియేషన్‌ నాయకులు ఆమెను కలిసి జాగృతిలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jun 23 , 2025 | 03:36 AM