Kavitha: రేవంత్‌రెడ్డి పేపర్ టైగర్: కవిత
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:43 AM
నల్లమల పులిబిడ్డనంటూ గొప్పగా చెప్పుకొనే.. రేవంత్‌రెడ్డి ఆ ప్రాంతానికి నష్టం కలిగించేలా ఏపీ జల దోపిడీకి పాల్పడుతుంటే బనకచర్ల ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): నల్లమల పులిబిడ్డనంటూ గొప్పగా చెప్పుకొనే.. రేవంత్‌రెడ్డి ఆ ప్రాంతానికి నష్టం కలిగించేలా ఏపీ జల దోపిడీకి పాల్పడుతుంటే బనకచర్ల ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణకు నష్టం జరుగుతున్నా పట్టించుకోని ఆయన పులిబిడ్డ కాదు.. కేవలం పేపర్ టైగర్ మాత్రమేనని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. గోదావరి జలాలను తరలించుకు వెళ్లేందుకు కేసీఆర్ ఒప్పుకొన్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి బీసీబిల్లును సాధించేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రాష్ట్రంలో రైల్ రోకో కార్యక్రమం చేపడతామన్నారు.