Share News

Irrigation Project: కేంద్రం జాతీయ హోదా నిరాకరిస్తే ఏం చేస్తున్నారు?

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:07 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం తగదని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆమె పేర్కొన్నారు.

 Irrigation Project: కేంద్రం జాతీయ హోదా నిరాకరిస్తే ఏం చేస్తున్నారు?

పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు స్పందించాలి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటి వనరులు పెంచేందుకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం తగదని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ వివక్ష చూపుతోందని, తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విస్మరించాయని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలున్నా.. రాష్ట్రానికి చేసింది సున్నా.. అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని, మన సంస్కృతి, పండుగలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అదేవిధంగా తెలంగాణకు నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై కూడా బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు స్పందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:07 AM