Share News

Sisters Tie Rakhi To KCR: అనుబంధానికి బ్రేక్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:11 AM

ప్రతి రాఖీ పండుగకు సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టి.. ఆయన్నుంచి ఆశీర్వాదం తీసుకొని

Sisters Tie Rakhi To KCR: అనుబంధానికి బ్రేక్‌

  • ఈసారి కేటీఆర్‌కు రాఖీ కట్టని కవిత

  • ‘అన్నా.. రాఖీ కట్టేందుకు ఇంటికి రానా’.. ఒక రోజు ముందే కేటీఆర్‌కు కవిత మెసేజ్‌

  • ‘నేను ఔట్‌ ఆఫ్‌ స్టేషన్‌’ అంటూ కేటీఆర్‌ రిప్లై

  • ఎర్రవెల్లి ఫాంహౌ్‌సలో కేసీఆర్‌కు రాఖీలు కట్టిన ఆయన సోదరీమణులు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రతి రాఖీ పండుగకు సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టి.. ఆయన్నుంచి ఆశీర్వాదం తీసుకొని అభిమానాన్ని చాటుకునే కల్వకుంట్ల కవిత ఈసారి సంప్రదాయానికి బ్రేక్‌ చెప్పారు. ఈసారి కేటీఆర్‌కు ఆమె రాఖీ కట్టలేదు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ నడుస్తోంది. ఈ అంశంపై కవిత వర్గీయులు మరో విధంగా స్పందించారు. పండుగకు ఒకరోజు ముందే.. అంటే శుక్రవారమే ‘అన్నా.. రాఖీ కట్టేందుకు నేను ఇంటికి రానా!’ అని కేటీఆర్‌కు కవిత మెసేజ్‌ చేశారని చెబుతున్నారు. కేటీఆర్‌ మాత్రం శుక్రవారం తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రాఖీ వేడుకలు జరగ్గా.. లగచర్ల గిరిజన మహిళలు ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం అక్కడి నుంచి కేటీఆర్‌ నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఆ తర్వాత కవిత పంపిన మేసేజ్‌కు ఆయన రిప్లై ఇచ్చినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ‘నేను అవుటాఫ్‌ స్టేషన్‌’ అంటూ ఆయన కవితకు తిరిగి మేసేజ్‌ పెట్టినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. శనివారం కూడా ఆయన హైదరాబాద్‌లో లేరని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. అక్కడ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ.. చెల్లెలు వినోదమ్మ కలిసి కేసీఆర్‌కు హారతి పట్టి, రాఖీలు కట్టి. మిఠాయిలు తినిపించారు.

Updated Date - Aug 10 , 2025 | 03:11 AM