Share News

MLC Kavitha: స్థానికంలో 80% స్థానాలు బీఆర్‌ఎస్‌కే: కవిత

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:23 AM

కాంగ్రెస్‌ పనితీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇది బీఆర్‌ఎ్‌సకు ఉపయోగపడనుందని, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే.. 80శాతం స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలు

MLC Kavitha: స్థానికంలో 80% స్థానాలు బీఆర్‌ఎస్‌కే: కవిత

హైదరాబాద్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పనితీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇది బీఆర్‌ఎ్‌సకు ఉపయోగపడనుందని, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే.. 80శాతం స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడం కోసం తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 17న రైల్‌రోకో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆమె తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.


స్థానిక ఎన్నికల్లో జాగృతి నాయకులు ఎవరైనా.. పోటీచేయాలని భావిస్తే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తిచేయాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే కేటీఆర్‌కు లేఖ రాయాలని తాను జాగృతి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా వస్తున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే స్పష్టతనివ్వాలని కోరారు.

Updated Date - Jul 04 , 2025 | 05:23 AM