Share News

దేవునిపల్లి ఆలయ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:34 AM

మండలంలోని దేవుని పల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

దేవునిపల్లి ఆలయ అభివృద్ధికి కృషి

పెద్దపల్లి రూరల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని దేవుని పల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆలయ నూతన కమి టీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలుకగా, ఆలయంలో స్వామివారిని దర్శించుకోని ప్రత్యేక పూ జలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ నూతన కమిటీ చైర్మన్‌ బొడ్డుపల్లి సదయ్య, ధర్మకర్తలు శ్రీపతి సుమన్‌, ఆడెపు సౌందర్య, ఇట్యాల సతీష్‌, తాల్లపల్లి రాజమౌళి, గాజుల సురేష్‌, ముడుసు శ్రీనివాస్‌, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఆలయ పూజారి లక్ష్మీనరసింహచార్యులను దేవాదాయ ఇన్‌స్పెక్టర్‌ సుజాత, కార్యనిర్వాహక అధికారి ముద్దసాని శంకర్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత రం ఎమ్మెల్యే పాలక మండలి సభ్యులను ఘనంగా సన్మానించి అభినం దించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజ యరమణరావు మాట్లాడుతూ ఆలయ ఆవరణలో పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంత రం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసిన ఈవో శంకర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. మాజీ జడ్పీటీసీ బండారి రాంమూర్తి, అప్పన్నపేట సింగిల్‌ విండో చైర్మన్‌ చింతపండు సంపత్‌, బొక్కల సంతోష్‌, పెద్దపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ నూగిల్ల మల్ల య్య, కాంగ్రెస్‌ నాయకులు ఎడెల్లి శంకర్‌, బొంకూరి అవినాష్‌, ఆరె సంతో ష్‌, కలబోయిన మహేందర్‌, గుర్రాల రాజు, చీకటి లక్ష్మీనారాయణ, నాయ కులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 12:34 AM