ప్రజా సంక్షేమానికి కృషి..
ABN , Publish Date - Feb 28 , 2025 | 02:36 AM
రాష్ట్రంలో ప్రజా పా లనలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వేముల వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
చందుర్తి,ఫిబ్రవరి 27 (ఆం ధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజా పా లనలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వేముల వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఎమ్మె ల్సీ ఎన్నికల్లో భాగంగా మండ ల కేంద్రంలో పట్టభద్రులను గురువారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటు అభ్య ర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పోలింగ్ సరళి చూస్తుంటే పట్ట భద్రులందరూ నరేందర్‌రెడ్డికి ఆశీర్వాదాలు ఇస్తున్నట్టుగా ఉందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పెద్దలు నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలో వివరంగా చెప్పారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీకునే జీతాలు ఇవ్వడం, 60 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నూతన విద్యా విధానంలో మార్పులు తెస్తూ, రాష్ట్రంలో స్కిల్ యూని వర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం తో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. మొదటి నుంచి బీజేపీకి బీఆర్‌ఎస్ నుంచి అన్ని విషయాలలో మద్దతుగా ఉందన్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని పోటీలో పెట్టకుండా బీజేపీ కి మద్దతు ఇస్తోందన్నారు. అభివృద్ధితో కాంగ్రెస్ పార్టీ వస్తుంటే.. బీజేపీ మతం పేరుతో వస్తోందన్నారు. ఆయన వెంట నాయకులు నాగం కుమార్, చింతపంటి రామ స్వామి, బొజ్జ మల్లేశం, గొట్టే ప్రభాకర్, భీమారాజు కనక రాజు, ధర్మపురి శ్రీనివాస్, మ్యాకల గణేష్, ఇల్లంతకుంట గణేష్, పులి సత్తయ్య, శ్రీనివాస్, ఏసుదాసు తదితరులు ఉన్నారు.