Share News

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:09 AM

మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని మహిళా సాధికారత, వ్యాపార వ్యవస్థాపక కమిటీ ఛైర్మన్‌ బెల్లం మాధవి అన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
స్వదేశీ మేళాలో మాట్లాడుతున్న బెల్లంమాధవి

- మహిళా సాధికారత, వ్యాపార వ్యవస్థాపక కమిటీ ఛైర్మన్‌ బెల్లం మాధవి

భగత్‌నగర్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని మహిళా సాధికారత, వ్యాపార వ్యవస్థాపక కమిటీ ఛైర్మన్‌ బెల్లం మాధవి అన్నారు. శుక్రవారం నగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలో ‘మహిళా ఆర్థిక స్వావలంబన, అభివృద్ధి’ అనే అంశంపై మహిళలకు సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలంటివారన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగా లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. స్వదేశీ జాగరన్‌ మంచ్‌ తెలంగాణ ప్రాంత మహిళా ప్రాంత మహిళా ప్రముఖ్‌ డాక్టర్‌ కళ్లెం స్వప్న మాట్లాడుతూ భారత దేశ సంస్కృతికి అహల్యభాయి విశేషకృషి చేశారన్నారు. ఽధానధర్మాలకు మారుపేరుగా నిలిచి మహ్మదీయులదాడుల్లో శిఽథిలమైన అనేక దేవాలయాలను పునర్నిర్మాంచారన్నారు. ఈ కార్యక్రమంలో సామ ఎల్లారెడ్డి, బల్లం స్వప్న, బూర్ల విజయలక్ష్మి, కామారపు మంజుల, కళ్లెం కవిత, పాక సంధ్యారేఖా, రమ, స్వరూపారాణి, కాచం దీప్తి, కరీంనగర్‌ డెయిరీ ఛైర్మన్‌, స్వదేశీ మేళా కన్వీనర్‌ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ఫ సరస్వతి శిశు మందిర్‌ విద్యార్థుల ప్రదర్శనను తిలకించిన కలెక్టర్‌

నగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలో శ్రీ సరస్వతి శిశుమందిర్‌ విద్యార్థులు ప్రదర్శించిన సాహిత్య ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సందర్శించారు. సాహిత్యంలోని పలు పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయని వాటిని చదివి జ్ఞానాన్ని పెంచుకో వాల న్నారు. ఈ కార్యక్రమంలో బల్మూరి కరుణాకర్‌రావు, ఇంజనీర్‌ కోల అన్నారెడ్డి, డాక్టర్‌చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, ముక్క హరీష్‌బాబు, దుర్శేట్టి నిరంజనాచారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 01:09 AM