మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:05 AM
మహిళలు అన్ని రంగాల్లో రాణిం చాలని టీజీవో అధ్యక్షుడు సమరసేన్, డోర్స్(డిస్టిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ రాజన్న సిరిసి ల్ల) అధ్యక్షుడు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : మహిళలు అన్ని రంగాల్లో రాణిం చాలని టీజీవో అధ్యక్షుడు సమరసేన్, డోర్స్(డిస్టిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ రాజన్న సిరిసి ల్ల) అధ్యక్షుడు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పుర స్కరించుకొని గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ మహిళలకి సమానమైన హక్కులతోపాటు ప్రత్యేకమైన చట్టాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డోర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి సూపర్‌వైజర్ నిర్మల దేవి, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, దేవిక సఖి ఇన్‌చార్జి విజయ, అనుపురం మహిళలు పాల్గొన్నారు. అలాగే సఖి ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజీ కేంద్రంలోనూ మహిళలకు విద్యార్థులకు అవగా హన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబా యి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మిషన్ భగీరథ ఈఈ జానకి, గెజి టెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, డీఆర్డీవో శేషాద్రి, పలు వురు అధికారులు పాల్గొన్నారు.