Share News

మందుల కొరత లేకుండా

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:30 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడం తో పాటు మందుల కొరత లేకుండా అవసరమైన ప కడ్బందీ చర్యలు తీసుకోవడంపై సర్కారు దృష్టి సారిం చింది.

మందుల కొరత లేకుండా

జగిత్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడం తో పాటు మందుల కొరత లేకుండా అవసరమైన ప కడ్బందీ చర్యలు తీసుకోవడంపై సర్కారు దృష్టి సారిం చింది. మందుల సరఫరాలో జరిగే అవకతవకలు అరిక ట్టడం, అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచ డం, ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో మందులు కొనే అవస రం లేకుండా చేయడంతో పాటు మందులకొరత రా కుండా ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచనుంది.

పలు చోట్ల మందుల కొరత...

జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రితో పాటు మెడి కల్‌ కళాశాలకు అనుబంధంగా మాతా శిశు కేంద్రం పనిచేస్తున్నాయి. వీటితో పాటు జిల్లాలోని పలు ప్రాం తాల్లో ఒక ఏరియా ఆసుపత్రి, మూడు సీహెచ్‌సీలు, 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 151 సబ్‌ సెంటర్లు, 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొమ్మిది, 71 పల్లెదవాఖానలు, ఐదు యూపీహెచ్‌సీలు, ఐదు బ స్తీ దవాఖానాల ద్వారా ప్రజలు వైద్య సేవలు అందిస్తు న్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఉచి తంగా మందులు సరఫరా చేసేందుకు ప్రతీఏటా బడ్జె ట్‌లో కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ఇందులో భా గంగా పలు ప్రధాన కేంద్రాల్లో మందుల నిల్వ, సరఫరా కోసం సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తా రు. దీని ద్వారా 128 రకాల మందులు, కాంబినేషన్‌లో 368 రకా లు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇలా జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితో పాటు, వైద్య విధా న పరిషత్‌ ఆధ్వర్యంలో కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి కేంద్రాల్లోని సీహెచ్‌సీలు, జిల్లావ్యాప్తంగా ఉ న్న పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చే స్తారు. అక్కడి నుంచి సబ్‌సెంటర్లు, గ్రామాల్లోని ఏఎన్‌ ఎం ద్వారా రోగులకు పలు కంపెనీలకు చెందిన మం దులు సరఫరా అవుతున్నాయి. అయితే కొన్నిచోట్ల త క్కువ వినియోగం, మరికొన్ని చోట్ల రోగుల సంఖ్య ఎ క్కువగా ఉండి సరఫరా చేసిన మందులు త్వరగా అ యిపోవడంతో పలుచోట్ల మందులు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కమిటీతో కట్టడి...

జిల్లాకు సరఫరా అవుతున్న మందులు అవసరమైన చోటుకు సరఫరా చేయడం, రోగుల నుంచి మందుల కొరతపై ఫిర్యాదులు రాకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. జనరల్‌ ఆసుపత్రి నుంచి సూ పరింటెండెంట్‌, సీహెచ్‌సీల నుంచి సీహెచ్‌వో, పీహెచ్‌ సీలకు బాధ్యులుగా జిల్లా వైద్యాధికారి మొత్తం ముగ్గురి తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. వీరు ప్రతీరో జు సమావేశం కావడం, మందుల నిల్వలను తనిఖీ చే సి అవసరం ఉన్న చోటుకు సరఫరా చేసేలా చర్యలు తీ సుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొందరు డాక్టర్లు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులు కాకుండా తమకు అనుకూలమైన మెడికల్‌ షాపుల్లో దొరికే మం దులను రాసి ఇస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్ట నున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న జనరిక్‌ రకాలను మాత్రమే వైద్యులు చీటిలో రాసి ఇచ్చేలా చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎప్ప టికప్పుడు రాష్ట్ర డ్రగ్స్‌ స్టోర్స్‌కు ఇండెంట్‌ పెట్టి సీజన్‌, అవసరాలకు అనుగుణంగా మం దులు తెప్పించుకోవాల్సి ఉంటుంది.

ఔషధి కార్యక్రమంపై..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవ సరమైన మందులు అందుబాటులో ఉంచడానికి ముందస్తు జాగ్రత్తలు తీ సుకోవడంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇటీవల జిల్లాలో ని వైద్యాధికారులు, ఫార్మాసిస్టులు, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌తో ఈ- ఔష ధి కార్యక్రమంపై శిక్షణ, అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలకు మందులు సరఫరా చేసేందుకు కనీసం మూడు నెలల ముందు సెంట్రల్‌ మెడికల్‌ స్టోర్‌కు ఇండెంట్‌ పంపాలని నిర్ణయించారు. పీ హెచ్‌సీల్లో సుమారు వంద రకాల మందులు ఉండేలా జాగ్రత్తలు తీసు కుంటున్నారు. రోగులకు ఇచ్చే ప్రతీఒక్క మందు ఈ-ఔషధ్‌లో నమోదు చే యడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

సమన్వయంతో మెరుగైన సేవలు..

డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో

సమన్వయంతో మెరుగైన సేవలు అందించే అవకా శాలున్నాయి. జిల్లాలోని వైద్యాధికారులు సమన్వయం గా వ్యవహరించి మందుల కొరత, సరఫరాపై చర్చిం చుకుని పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఎప్ప టికప్పుడు అధికంగా నిల్వ ఉన్న చోటు నుంచి కొరత ఉన్న చోటుకు మందులు సరఫరా చేసే వీలుంటుంది.

Updated Date - Jan 17 , 2025 | 01:30 AM