Share News

త్వరలో అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:59 AM

అర్హులైన వారందరికీ తెల్ల రేష న్‌ కార్డులను త్వరలోనే జారీచేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

త్వరలో అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు

సుల్తానాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన వారందరికీ తెల్ల రేష న్‌ కార్డులను త్వరలోనే జారీచేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండలంలోని గొల్లపల్లిలో ఎన్‌ఆర్‌జీఈఎస్‌ నిధులు పది లక్షలతో నిర్మించను న్న సీసీ రోడ్డు పనులకు సంబంధించిన శిలాఫలాకాన్ని బుధవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు వాటిని దశల వారీగా అమలు చేస్తున్నామని ఇందులో భాగంగా గ్రామాలలో ఎంతమంది అర్హులైన వారు ఉన్నా వారందిరికీ తెల్ల రేషన్‌ కార్డులు త్వరలోనే జారీ చేస్తామన్నారు. ఈనెల 26 నుంచి రైతు కూలీలకు నెలకు పన్నెండు వేలు, రైతు భరోసా ఎకరానికి 12 వేలు పెంచి అందిస్తామన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషిచేస్తుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ ఓర్వలేకపోతుందని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నారు. కాగా, గర్రెపల్లి మండల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బండారి రమేష్‌, నామని రాజిరెడ్డి, పన్నాల రాములు, బల్మూరి వెంకటరమణారావు, దామోదర్‌ రావు, వెంకన్న, చిలుక సతీష్‌, కల్లెపల్లి జానీ, చక్రధర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:59 AM