కల్యాణం.. కమనీయం..
ABN , Publish Date - Feb 28 , 2025 | 02:38 AM
మండలం లోని ఎన్గల్ గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆల యంలో గురువారం శివపార్వతుల కల్యాణ మహో త్సవాన్ని అర్చకులు అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు.
చందుర్తి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మండలం లోని ఎన్గల్ గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆల యంలో గురువారం శివపార్వతుల కల్యాణ మహో త్సవాన్ని అర్చకులు అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేది కపై ఉత్సవమూర్తులను పెట్టి కల్యాణాన్ని వేదమం త్రోచ్ఛరణల మధ్య వైభంగా నిర్వహించారు. వేముల వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మడ లక్ష్మనరసింహా రావు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్‌రావులు కల్యాణోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. సింగిల్ విండో చైర్మన్‌లు తిప్పని శ్రీని వాస్, జలగం కిషన్‌రావు, నాయకులు ఎన్గంటి శంకర్, కుసుంబ జనార్ధన్, లాండె తిరుపతి, గుంటి గంగాధర్, పెంటయ్య, ప్రసాద్, శ్రీనివాస్, నగేష్, కుల సంఘాల నాయ కులు పాల్గొన్నారు.
కోనరావుపేట : కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీసీతారాముల ఆలయంలో గురువారం శివపార్వతుల కల్యా ణం అత్యంత వైభవంగా జరిగింది. వేములవాడ రాజన్న ఆల య అనుబంధ ఆలయమైన మామిడిపల్లి ఆలయంలో శివ కళ్యాణం అర్చకులు కృష్ణహరి ఆధ్వర్యంలో కన్నుల పండువ గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ఏర్పాట్లను సందర్శించారు. ఆలయ చైర్మన్ తిరుపతిరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రుద్రంగి : మండల కేంద్రంలో వెలసిన శ్రీబుగ్గ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్షించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. అలాగే వేములవాడ నియోజకవర్గ బబీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ మాజీ చైర్మన్ లు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా, రుద్రంగి మండలం మానాల గ్రామంలోని భవాని శంభు లింగేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భాగం గా భక్తులకు మహాఅన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం కల్యాణ మహోత్సవ వేడుకలు కమనీయంగా జరిగా యి. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనా లు తీసి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. ఒగ్గు కథ కళాకారులు తమ ఆటపాటలతో ఆకట్టున్నారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రా మాల తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి (సిరిసిల్ల రూరల్) : తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీత్రికుటాలయ పురాతన శివాలయంలో మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం అలయంలో అత్యం త వైభవంగా అన్నపూజ కార్యక్రమాన్ని వేదమత్రోఛ్చరలతో చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, అలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల అర్బన్ పరిధిలోని రగుడు గ్రామ శివారులోని నెమళ్ల గుట్టపె ఉన్న మల్లిఖార్జున స్వామిఅలయంలో గురువారం మల్లన్న కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతరకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామంలోని శ్రీకృష్ణయాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి యాదవకులానికి చెంది న మహిళలందరూ డప్పు వాయిద్యాలతో బోనాలు తీసుకొని ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఉదయం ఆలయంలో ఒగ్గు పూజారులు మల్లన్న పట్నాలు వేసి మల్లన్న కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. అలాగే ఆలయంలో పూజారులు మహాలింగార్చన, అన్నపూజలు చేపట్టారు. అలాగే పక్కనగల రేణుక ఎల్లమ్మ ఆలయంలో పట్నాలు వేసి రేణుక ఎల్లమ్మ పండుగను వైభవంగా ఒగ్గు పూజారులు జరిపించారు. తాజా మాజీ కౌన్సిలర్ పోచవేణి సత్య ఎల్లయ్యమాదవ్, యాదవ సంఘం నాయకులు పా ల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు. యాదవ సంఘం నాయకులు, కులస్ధులు పాల్గొన్నారు.