Share News

కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

ABN , Publish Date - Mar 04 , 2025 | 01:03 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ క్యాంప్‌ కార్యాలయంలో కరీంనగర్‌కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.

 కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

కరీంనగర్‌ అర్బన్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ క్యాంప్‌ కార్యాలయంలో కరీంనగర్‌కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు, త్వరలో కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరవ్యాప్తంగా నిలిచిన పనులు ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేస్తామన్నారు. సీఎంఏ గ్రాంట్‌ నిధులు రావాల్సి ఉన్నాయని, వాటిని వినియోగించి పనులు చేపడతామని తెలిపారు. కరీంనగర్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వైద్యుల అంజన్‌ కుమార్‌, మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మద నర్సన్న, ఆకుల పద్మ ప్రకాష్‌, మల్లికార్డున రాజేందర్‌, కోటగిరి భూమాగౌడ్‌, నేతికుంట యాదయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్‌, మాచర్ల ప్రసాద్‌, పిట్టల శ్రీనివాస్‌, గంట కళ్యాణి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2025 | 01:03 AM