అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం..
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:41 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హు లైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
రుద్రంగి, జనవరి 22 (ఆంద్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హు లైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పా టుచేసిన ప్రజాపాలన గ్రామసభలో బుధవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర బీసీ రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కూమార్‌ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, రైతుకూలీలు, నిరుద్యోగులు, పేదలకు ఈ స్థా యిలో ఏ ప్రభుత్వం దేశంలో మేలు చేయలేద న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సూ మారు 90లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, 10 సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, రాజకీయ స్వార్థం కోసం ఉపఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడ మా త్రమే కార్డులు ఇచ్చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పేదలందరికి రేషన్‌కార్డులు ఇవ్వాల ని నిర్ణయం తీసుకున్నామని, జనవరి 26 నుంచి రాష్ట్రంలో ఆర్హత కలిగిన చివరివ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చేవరకు ప్రక్రియ కొనసాగుతుందన్నా రు. జాబితాలో పేరు లేకుంటే దరఖాస్తు చేసుకో వాలని, అర్హత ఉన్న వారికి కార్డులు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చి న తర్వాత మరోసారి ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే సొంత ఊరు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి మొదటి దఫాలోనే ఇళ్లు మంజూరుచేస్తామన్నారు. బీసీల కు రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.6లక్షలు అందిస్తా మన్నారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాని కి రూ.12వేలు, గతంలో రైతుబంధు రాళ్లురప్పల కు, రియల్ ఎస్టేట్ భూములకు, రోడ్లలకు ఇచ్చా రని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ యోగ్య మైన భూములకు పంట వేసినా వేయకున్న రైతులకు రైతు భరోసా అందుతుందన్నారు. బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కావాలని ప్రతిపక్ష నాయకులు సూచ నలు, సలహాలు చేయకుండా గ్రామసభల్లో ప్రజ లను చెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్ర భుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతి పక్ష నాయకులకు అబద్ధాలు మాట్లాడుతన్నారని అక్కచెల్లెళ్లు అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి మం డలం మానాలలోని కొత్త చెరువు, పాతచెరువుల కు కలికోట సూరమ్మప్రాజెక్టు నుంచి లిప్ట్ ద్వారా నీరు అందిస్తే సాగు, తాగు నీరందిస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని,ఇందుకు నిధులు మంజూరుచేయాలని మంత్రిని కోరారు. ప్యాకేజీ 9లో మలక్‌పేట రిజర్వాయర్‌లో టీఏంసీ నీళ్లు నింపామని, కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనుల శరవేగంగా జరుగుతున్నాయని, పూర్తయితే 43 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే రుద్రంగి, వేములవాడ, కథలాపూర్ బ స్టాండ్‌ల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు.అనంతరం మంత్రులు, ప్రభు త్వవిప్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్య నారాయణ, కలెక్టర్ సందీప్ కూమార్‌ఝా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌ డ్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ సర్పం చ్ తర్రె ప్రభలత మనోహర్, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీని వాస్‌రెడ్డి, తూం జలపతి, సామ మోహన్‌రెడ్డి, గండి నారాయణ, ఇప్ప మహేష్, మాడిశెట్టి అభి లాష్, తర్రె లింగం, పల్లి గంగాధర్, సిరికొండ రవి, స్వర్గం పరందామ్, సూర యాదయ్య, గం ధం మనోజ్, దర్న మల్లేశం, ద్యావల దీలీఫ్, ప డాల శ్రీనివాస్, పూదరి మహిపాల్, ఎర్రం అర వింద్, చెలుకల శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.