Share News

నిధుల కోసం పోరాడుతాం

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:40 AM

కరీంనగర్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేంత వరకు పోరాడతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు.

నిధుల కోసం పోరాడుతాం
అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేంత వరకు పోరాడతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. నగరంలోని 32వ డివిజన్‌లో 45 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌, అధికారులను ఆదేశించారు. స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి, సీఎం హామీ నిధులతో కరీంనగర్‌ ఆర్‌ఎస్‌ పాలనలో సుందరంగా అభివృద్ధి చెందిందన్నారు. నగరపాలక సంస్థపై ఆర్థికభారం పడకుండా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం 100 కోట్ల చొప్పున 350 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. గతంలో కేటాయించిన 85 కోట్ల సీఎం హామీ నిధుల పనులను ఇప్పటి వరకు ప్రారంభించక పోవడం శోచనీయమన్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ను పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్‌ మర్రి భావన, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, కార్పొరేటర్లు జంగిలి ఐలేందర్‌యాదవ్‌, తోట రాములు, దిండిగాల మహేశ్‌, జంగిలి సాగర్‌, నాంపల్లి శ్రీనివాస్‌, బోనాల శ్రీకాంత్‌, కచ్చు రవి, నాయకులు గందె మహేశ్‌, కోల సంపత్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2025 | 12:40 AM