పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలో చేశాం..
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:38 AM
బీఆర్‌ఎస్ హయాంలో పది సంవత్సరాలలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే చేసి చూపించిందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

వేములవాడ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ హయాంలో పది సంవత్సరాలలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే చేసి చూపించిందని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేములవాడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం గురువారం వేములవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుం దని అన్నారు. గత పదేళ్లుగా డీఎస్సీ వేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము వేశామన్నారు. పదేళ్లలో 55వేల ఉద్యోగాలు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ వచ్చాక కేవలం పది నెలల్లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్‌గా భావించాలని, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఫైన ల్‌గా భావించాలని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేయాల ని, కాంగ్రెస్ అభ్యర్థి వి. నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించా లని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాం గ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు తది తరులు పాల్గొన్నారు.