Share News

వ్యర్థాల సేకరణ గాలికి

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:09 AM

మున్సిపాలి టీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీయూస్‌, రీసైక్లింగ్‌) విధా నం అమలు పడకేసింది.

వ్యర్థాల సేకరణ గాలికి

జగిత్యాల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలి టీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీయూస్‌, రీసైక్లింగ్‌) విధా నం అమలు పడకేసింది. మున్సిపల్‌ శాఖ గత యేడాది జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అన్ని మున్సిపాలిటీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణ చేసేలా వార్డుకు ఒకటి చొప్పున ప్రాంతాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మున్సిపా లిటీల్లో ఒకటి, రెండు వార్డుల్లో ఏర్పాటు చేసి చేతులు దులుపు కొన్నారు. ప్రారంభంలో రెండు, మూడు నెలలు హడా వుడి చేసిన అధికారులు తర్వాత వాటిని నిర్వహ ణ గాలికి వదిలేశారు. దీంతో మంచి ఉద్దేశంతో ఏర్పా టు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాల నిర్వహణ అటకెక్కింది.

ఒకటి, రెండు వార్డుల్లోనే ఏర్పాటు

జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ఒకటి రెండు వార్డు ల్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగితా వార్డుల్లో ఏర్పాటు చేయకపోవడంతో పాటు ప్రస్తుతం నిర్వహణను పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలో ఒ కరి ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులు మరో కు టుంబానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. పుస్త కాలు, దుస్తులు, పేపర్లు, చెప్పులు, కుర్చీలు, బల్లలు, మంచాలు, పరుపులు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ప్లాస్టిక్‌ వ స్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇనుప సామగ్రి తదితరాలను సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు వి విధ కారణాలతో అలాంటి వస్తువులను వినియోగించ కున్నా చాలా మంది వాటిని ఇళ్లలో ఉంచుకుంటుం టా రు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్‌ పర్స న్‌ల సహాయంతో ఆయా వార్డుల్లోని ఇళ్లలో వ్యర్థాలు, ని రుపయోగంగా ఉన్న వస్తువులను సేకరించడం లక్ష్యం గా పెట్టుకున్నారు. వీటిలో కొన్ని కొద్ది మార్పులతో లేదా నేరుగా ఇతరులకు ఉపయోగపడే అవకాశముంటుందని ప్రభుత్వం భావించింది. వాటిని నిరుపయోగంగా ఉం చకుండా ఉపయోగంలోకి తీసుకు వచ్చేలా ప్రయత్నించాలన్న యోచనతో ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్యక్రమం అమలు పట్ల నిర్లక్ష్యం చూపడంతో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాల్లో భద్రపర్చాలి.

సేకరించిన వస్తువులను వేర్వేరుగా ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాల్లో భద్రపరుస్తా రు. ఈ వస్తువులు ఎవరైనా వినియోగించుకోవాలనుకుంటే వాటిని ఉచితం గా అందజేస్తారు. దీంతో పునర్వినియోగానికి అవకాశం లేని వాటిని వేరు చే సి పునరుత్పత్తికి తరలిస్తారు. వార్డుల్లో కేంద్రాలు లేకపోవడంతో పాటు ఉ న్న కేంద్రాలను కూడా సరిగా చేపట్టడం నిర్వహించడం లేదు. దీంతో ము న్సిపాలిటీల్లోని నివాస గృహాల్లో వస్తువులు పేరుకపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పకడ్బందీగా అమలుకు చర్యలు చేపట్టా లని పట్టణాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 10 , 2025 | 01:09 AM