Share News

పాలిస్టర్‌ వస్త్రానికి కూలి పెంచాలి..

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:53 AM

సిరిసిల్లలో పాలిస్టర్‌ వస్త్రానికి యజమానులు కూలి పెంచాలంటూ సోమవారం చేపట్టిన ధర్నాలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ కోరారు.

పాలిస్టర్‌ వస్త్రానికి కూలి పెంచాలి..

సిరిసిల్ల రూరల్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో పాలిస్టర్‌ వస్త్రానికి యజమానులు కూలి పెంచాలంటూ సోమవారం చేపట్టిన ధర్నాలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ కోరారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చంద్రం పేటలో శనివారం మరమగ్గాల కార్మికులతో జరిగిన సమావేశంలో 15 మందితో సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ వార్డు కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలిస్టర్‌ వస్త్రాలను తయారుచేసే మరమగ్గాల కార్మికులకు కూలి ఒప్పందాన్ని యజమానులు తిరిగి అమలుచేయకపోవడంతో పాటు కూలి పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నా రు. పెరిగిన నిత్యావసర ఽసరుకుల ధరలకు అందిస్తున్నా కూలి సరిపోకపోవడం తో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ అప్పులపాలు అవుతున్నారన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా నెలకు రూ.20 వేల వేతనం పెంచాల ని యజమానులతో పాటు చేనేత జౌళి శాఖ అధికారులకు నోటీసులు అందించా మన్నారు. అయినా వారు స్పందించకపోవడంతోనే సోమవారం కొత్త బస్టాండ్‌లో ని పాలిస్టర్‌ అసోసియేషన్‌ భవనం ఎదుట మరమగ్గాల కార్మికులతో భారీ ఎత్తున ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఒగ్గు గణేష్‌, నక్క దేవదాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:53 AM