శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:37 AM
శాంతి భద్ర తలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
సిరిసిల్ల క్రైం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): శాంతి భద్ర తలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సబ్‌డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీట ర్లు, హిస్టరీ షీట్‌లు, సెస్పెక్ట్‌గా ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలన్నారు. తర చూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరమై న చర్యలు తీసుకుంటామన్నారు. నేరస్థులుగా ఉన్న వా రందరు విధిగా పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని, లేని పక్షంలో బైండోవర్ చేస్తామన్నారు. నేరాలకు దూరంగా ఉంటు సత్ప్రవర్తనతో మెదులుతున్న నేరస్థులపై రౌడీ సీట్స్ తొలగిస్తామన్నారు. అల్లర్లతో ప్రమేయం ఉన్న వారిని ప్రతినెల పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకాలపాలకు పా ల్పడితే ఉక్కుపాదం మోపుతామన్నారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, ఎస్‌ఐలు రాంమ్మోహాన్, శ్రీకాంత్, రమాకాంత్, గణేశ్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.