దివ్యాంగులకు యూడీఐడీ నంబర్ ఇవ్వాలి
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:53 AM
ప్రతి దివ్యాంగుల కు యూడీఐడీ నంబర్‌ను జనరేట్ చేయాలని పంచా యతీరాజ్ కార్యదర్శి, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ అ న్నారు.
సిరిసిల్ల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి దివ్యాంగుల కు యూడీఐడీ నంబర్‌ను జనరేట్ చేయాలని పంచా యతీరాజ్ కార్యదర్శి, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ అ న్నారు. శనివారంహైదరాబాద్ నుంచి సదరం సర్టిఫికెట్ల నుంచి యూనిక్ డిజెబులీటీ ఐడీ జారీ, సోలార్ పవర్ ప్లాంట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ బదులు యూనిక్ డిజెబులీటీ ఐడీ జారీ చేయాల్సి ఉంటుందని సదరం సర్టిఫికెట్ నుంచి ఈ కార్డ్ జారీకి బదిలీ చేసేం దుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాల న్నారు. దివ్యాంగులకు వైద్యులు ధ్రువీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్‌ను యూడీఐడీ పోర్ట ల్‌లో నమోదు చేయాలని, దివ్యాంగులకు సంబంధించి ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలన్నారు. దివ్యాంగులకు కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటి అడ్రస్‌కు వస్తుందన్నారు. నూతనంగా యూడీఐడీ కార్డుల కోసం మీసేవ దరఖాస్తు చేసుకోవచ్చని, సదరం సర్టిఫికెట్ ఉన్నవారు డీఆర్‌డీవో ద్వారా యూడీఐడీ జనరేట్ చేస్తా రన్నారు. ఫిబ్రవరి 28వరకు జారీచేసిన సదరం సర్టిఫికె ట్లతో పెన్షన్, ఇతర సదుపాయాలను తెలంగాణలో ది వ్యాంగులు పొందవచ్చన్నారు. ఇతరరాష్ట్రాల్లో సౌకర్యాలు పొందాలంటే యూడీఐడీ కార్డు తప్పనిసరి అవుతుందని అన్నారు. మార్చి 1 నుంచి యూడీఐడీ జారీ చేస్తారన్నా రు. వీటి ద్వారానే పెన్షన్ పొందాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఉన్న మీసేవ కేంద్రాల నిర్వహకులు, పంచాయతీ కార్యదర్శులు, వీవోఏవోలు, సీసీ లు, ఎంపీడీవోలు, ఏడీఎంలకు యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై శిక్షణ అందించాల న్నారు. ఆసుపత్రుల్లో నిరార్ధరణ కోసం అవస రమైన వైద్యులు, పరికరాలు ఉండేలా చూడా లన్నారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సమన్వయం చేస్తూ ప్రస్తుతం అందుబా టులో ఉన్న వసతులను పరిశీలించి నూతన కావాల్సిన వస్తువుల ప్రతిపాదనలు అందజే యాలన్నారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్‌లను తయారుచేయాలని పంచాయతీ కార్యదర్శు లకు సూచించారు. కుసుమ్ పథకం వినియోగించుకొని రైతులు, మహిళ సంఘాల ద్వారా నడిపేలా చిన్నచిన్న సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో శేషా ద్రి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, అదనపు డీఆర్‌డీవో శ్రీని వాస్, డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.