రైతులను దగా చేస్తున్న రాష్ట్రప్రభుత్వం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:52 AM
రైతు భరో సా పేరిట రైతులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. రైతు భరోసా కింద రైతులకు 12వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించడంతో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వ హించారు.

- బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన
పెద్దపల్లి టౌన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రైతు భరో సా పేరిట రైతులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. రైతు భరోసా కింద రైతులకు 12వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించడంతో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వ హించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్దగల అంబే ద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా 15వేలు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కొయ్యడ సతీష్, కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, రేవల్లి స్వామి, కనుకుర్తి కార్తీక్, కో ఆప్షన్ సభ్యులు రహీం, చంద్రమౌళి, మాజీ ప్రజాప్రతినిధులు పీఏసీఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
మంథని: ఏడాది పాలనలో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోని సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా పేరిట మరోసారి రైతులను దగా చేశాడని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామశివారులోని రైతు పొలంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చన హామీ పత్రాలను సోమ వారం బురదలో పాతర వేసి నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసాలో ప్రతి రైతుకు ఎకరాలకు రూ. 15 వేలు ఇవ్వకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తురన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, జంజర్ల శేఖర్, లోడారి రాములు, మంథని లక్ష్మణ్, పోతిపెద్ది కిషన్‌రెడ్డి, అత్తె చంద్రమౌళి పాల్గొన్నారు.
సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర ఏ ఒక్క హమీలను కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నా రు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, బాలాజీరావు, పాల రామారావు, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, సూర శ్యామ్, దయాకర్, మొల్గూరి అంజయ్య, మోహన్ రెడ్డి, కుమార్ బాబు, కర్రె కుమార్, మీస శ్రీను తదితరులు పాల్గొన్నారు.