లైన్‌మెన్ సేవలు ప్రశంసనీయం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:34 AM
విద్యుత్ సంస్థలో క్షేత్ర స్థాయిలో పనిచేసే అన్ మ్యాన్డ్,, ఆర్టిజన్లు, జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, ఎల్‌ఎం, ఎల్‌ఐ, ఎస్‌ఆర్, ఎల్‌ఐ, ఫోర్‌మెన్‌ల సేవలు ప్రశంసనీయమని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రమేష్‌బాబు అన్నారు.

గణేశ్‌నగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ సంస్థలో క్షేత్ర స్థాయిలో పనిచేసే అన్ మ్యాన్డ్,, ఆర్టిజన్లు, జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, ఎల్‌ఎం, ఎల్‌ఐ, ఎస్‌ఆర్, ఎల్‌ఐ, ఫోర్‌మెన్‌ల సేవలు ప్రశంసనీయమని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రమేష్‌బాబు అన్నారు. కరీంనగర్ టౌన్ డివిజన్‌లోని టౌన్ 5సెక్షన్ టవర్ సర్కిల్, సప్తగిరి కాలనీలో, కరీంనగర్ రూరల్‌లోని బొమ్మకల్ సబ్‌స్టేసన్‌లలో లైన్‌మెన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది పనితీరుతోనే అంత రాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మన సంస్థను దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ పంపిణీ లసంస్థ (డిస్కం)గా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముం దుకు సాగాలన్నారు. సిబ్బంది భద్రత కంటే సంస్థకు మించినది లేదన్నారు. సంస్థ పరంగా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వేసవి దృష్ట్యా ఎస్‌ఈ రమేష్ బాబు, డివిజినల్ ఇంజనీర్ జంపల రాజం, రూరల్ ఏడీఈ రఘు ఆద్వర్యంలో రూరల్‌లో నాలుగు కొత్త ట్రాన్స్‌పర్మర్లను చార్జి చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ టెక్నికల్ ఉపేందర్, డీఈ ఆపరేషన్ రాజం, ఎం.లావణ్య, పంజాల శ్రీనివాస్ గౌడ్, రూరల్ ఏడీఈ, ఏఈ మల్లయ్య పాల్గొన్నారు.