Share News

గత పాలకుల నిర్వాకం వల్లే నీళ్ల కష్టాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:56 AM

గత ప్రభుత్వ పాలకుల నిర్వా కం వల్లే రైతులకు తాగు, సాగు నీటి కష్టాలు వచ్చాయని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

గత పాలకుల నిర్వాకం వల్లే నీళ్ల కష్టాలు

ధర్మారం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వ పాలకుల నిర్వా కం వల్లే రైతులకు తాగు, సాగు నీటి కష్టాలు వచ్చాయని ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. మేడారం రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గుతున్న విషయం రైతులు విప్‌ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో బుధ వారం ఆయన రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో మేడారం చెరువు నుంచి సిరిసిల్ల, సిద్దిపేటకు నీళ్లు తరలించారే తప్ప ఇక్కడి రైతాంగాన్ని ఎన్నడూ పట్టిం చుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ఇటీవల గోదావరిలో నీటి ఎద్దడి గురించి ఇరిగేషన్‌ మినిస్టర్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని స్వయంగా కలు వగా వెంటనే స్పందించి ఒక టీఎంసీ నీరు విడుదల చేశారని గుర్తు చేశారు. మేడారం రిజర్వాయర్‌ను కూడా బుధ, గురువారాల్లో నింపుతా మని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ధర్మపురి నియోజకవర్గంలో ఇరిగేషన్‌ మినిస్టర్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఉంటుందని, ఈ సంద ర్భంగా రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేసి ధర్మపురి నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అడ్లూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ అరిగె లింగయ్య, బ్లాక్‌-2 మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు కొత్త నర్సింహులు, సీనియర్‌ కాంగ్రేస్‌ నాయకులు కాడే సూర్యనారాయణ, దేవి జనార్ధన్‌, ఒడ్నాల శంకరయ్య, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సోగాల తిరుపతి, మాజీ ఎంపీటీసీ అజయ్‌పాల్‌రెడ్డి, దేవి చిరంజీవి, దేవి అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:56 AM