Share News

తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:11 AM

తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నూతన సంస్కరణల వల్ల తపాలా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యు మహేందర్‌ అన్నారు

 తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హుజూరాబాద్‌ తపాలా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఉద్యోగులు

- పోస్టల్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

హుజూరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నూతన సంస్కరణల వల్ల తపాలా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యు మహేందర్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ తపాలా కార్యాలయం ఎదుట పోస్టల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ డెలివరీ సెంటర్ల ద్వారా పోస్ట్‌ మెన్‌ స్టాఫ్‌ తగ్గిపోతుందన్నారు. మెకనైజ్డ్‌ డెలివరీ సిస్టమ్‌ ద్వారా పోస్టల్‌ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలన్నారు. తపాలా ఉద్యోగులకు నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచాలన్నారు. గ్రామీణ డాక్‌ సేవకులను తీసుకొని సివిల్‌ సర్వెంట్‌ హోదా కల్పించడంతో పాటు, పెన్షన్‌, మెడికల్‌, బెనిఫిట్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్‌, రజినీకాంత్‌, తిరుపతినాయక్‌, అనిల్‌, రాజమౌళి, ప్రవీణ్‌, చంద్రమోహన్‌, వేణు, సందీప్‌, శ్రీనివాస్‌, సమ్మరాజు, తిరుమలేష్‌, హరీష్‌, అనిల్‌, స్వామి, అపూర్వ, శివాజీ, సాయి, సత్యం, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 01:11 AM