పార్టీకి ప్రజాసంఘాలే పట్టుకొమ్మలు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:30 AM
కమ్యునిస్టు పార్టీకి ప్రజా సంఘాలే పట్టుకొమ్మలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జిల్లా కార్యవర్గ, ప్రజాసంఘాల సంయుక్త సమావేశం శుక్రవారం జరిగింది.

భగత్‌నగర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కమ్యునిస్టు పార్టీకి ప్రజా సంఘాలే పట్టుకొమ్మలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జిల్లా కార్యవర్గ, ప్రజాసంఘాల సంయుక్త సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంగా పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు. సీపీఐ వందేళ్ల చరిత్రలో పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించామన్నారు. వర్గ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక, కర్షక, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ముందుండి పోరాటాలు నిర్వహించేది సీపీఐ మాత్రమే అన్నారు. పార్టీ అభ్యున్నతి, బలోపేతం కోసం ప్రజాసంఘాల నిర్మాణం బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసంఘాల బాధ్యులు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్‌కుమార్ నాయకులు అందె స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మీ, టేకుమల్ల సమ్మయ్య, ప్రజా సంఘాల ఆఫీస్ బేరర్లుతదితరులు పాల్గొన్నారు