మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:06 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతరను వైభ వంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌కు సూచించారు.

వేములవాడ కల్చరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతరను వైభ వంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్‌కు సూచించారు. రాజన్న దర్శనానికి వచ్చిన కమిషనర్‌ను ఆది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గతంలో ఏర్పాటు చేసిన వీటీడీఏ సమా వేశంలో తీర్మానం చేసిన అంశాలపై చర్చించారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు.
రాజన్న సేవలో దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దేవదాయశాఖ కమిషనర్ శ్రీధర్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి కోడెమొక్కును చెల్లించు కున్నారు. ఆలయ కల్యాణమండపంలో అర్చకులు ఆశీర్వచనం, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈఈ రాజేష్, డీఈ మహిపాల్, ఏఈవో శ్రావణ్, ఆలయ సూపరిం టెండెంట్ తిరుపతిరావు, వెంకటప్రసాద్, రాజేందర్, శ్రీకాంతచారి, సింహచారి ఉన్నారు.