ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:59 AM
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇల్లంతకుంట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలపరిషత్ కార్యాలయంలో శనివారం ఇరిగేషన్ అధి కారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యమానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా విడుదలయ్యే నీటితో గొలుసుకట్టు చెరువులు నింపాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా అధికారులు కాలువలను నిరంతరం పరిశీలించాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే దాచారం, బోటిమీదిపల్లె, పెద్దలింగాపూర్, రామోజిపేట తదితర గ్రామాల రైతులు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. భూసేకరణ కోసం అధికారులు నివేదిక ఇచ్చారని ప్ర భుత్వం దృష్టికి తీసుకపోయి నిధుల మంజూరు చేయిస్తానన్నారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, ఈఈ వేణుబాబు, డీఈలు దేవేందర్, సీతారామరా జు, తహసీల్దార్ ఫారూఖ్, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి, అంతగిరి వినయ్‌కుమార్, పసుల వెంకటి, పాశం రాజేందర్‌రెడ్డి, ఆనందరెడ్డి, బాలపోచయ్య, బాల్‌రెడ్డిలతో పాటు ఏఎమ్‌సీ డైరెక్టర్లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.