ఎంసీహెచ్ లో డాక్టర్‌ను నియమించని ప్రభుత్వం..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:46 AM
ఆడబిడ్డలు, చిన్న పిల్లలకు అత్యవసర వైద్యసేవలు అందించే స్థానిక మాతా శిశువు సంరక్షణ కేంద్రంలో 2 నెలలుగా డాక్టర్‌ను నియ మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు.

మంథని, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డలు, చిన్న పిల్లలకు అత్యవసర వైద్యసేవలు అందించే స్థానిక మాతా శిశువు సంరక్షణ కేంద్రంలో 2 నెలలుగా డాక్టర్‌ను నియ మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. స్థానిక ఎంసీహెచ్‌ను పుట్ట మధు శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల కాన్పు తల్లిదండ్రులకు భారం కాకూడదనే తమ బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్ప అలో చనతో మాతా శిశు ఆసుపత్రిని నిర్మించి మెరుగైన వైద్య సేవలందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసుపత్రిపై మంత్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించారు. నిత్యం సీఎంతో కలిసి తిరుగుతున్న మంథని ఎమ్మెల్యే తన సొంత నియోజక వర్గకేంద్రంలోని మాతాశిశు ఆసుపత్రిలో ఒక డాక్టర్‌ను నియమించకపోవడం దురదృష్టకర మన్నారు. మంథని ప్రజల ఓట్లతో గెలిచి మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే వారి కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. రెండునెలలుగా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్‌ను నియ మించడంలో విఫలమయ్యారన్నారు. ఆసుప త్రిలో డాక్టర్ నియామకం,నిర్వాహణపై మం త్రి స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. తాము అధికారం లో ఉండగా ఆసుపత్రి నిర్వాహణపై ప్రత్యేక చర్యలు తీసు కున్నామని, తరచూ సందర్శించామన్నారు. ఇప్పుడు ఆసు పత్రిని గాలికి వదిలివేశారన్నారు. దీంతో ప్రసూతి కోసం గర్భణులు, వైద్య సేవల కోసం బాలింతలు, శిశువులు గోదావరిఖని, కరీంనగర్‌కు వెళ్లాల్సిన దుస్థితి ఉందన్నారు. ఈవిషయంలో కలెక్టర్ స్పందించకపోవడం విచారకరమ న్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ఆసుపత్రిలో డాక్ట ర్‌ను నియమించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్, తగ రం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, కాయితి సమ్మయ్య, వంశీ, ఆసీఫ్, ఇర్ఫాన్, కుమార్, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.