Share News

రైతును రాజుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:59 AM

రైతును రాజుగా చూడడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని సింగిల్‌ విండో గోదామును సోమవారం ప్రారంభించారు.

రైతును రాజుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యం
సింగిల్‌ విండో గోదాం ప్రారంభిస్తున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రైతును రాజుగా చూడడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని సింగిల్‌ విండో గోదామును సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం షాదీ ముబారక్‌ కల్యాణ లక్షి,్మ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎక్కువ అందజేసిందన్నారు. రైతు భరోసా ఈ నెల నుంచి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు అందజేయనున్నట్లు చెప్పారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్‌ విండో చైర్మన్లు బండ నర్సయ్య, సంకినేని రామ్మోహన్‌రావు, వైస్‌ చైర్మన్‌ అనుపాటి భూంరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తాళ్లపల్లి ప్రభాకర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌ రెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌ పాషా పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:59 AM