Share News

కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:02 AM

సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవే ర్చడమే సీఐటీయూ లక్ష్యమని, దీనికి ఇతర కార్మిక సంఘాలు కలిసి రావాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీ యూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం

గోదావరిఖని, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవే ర్చడమే సీఐటీయూ లక్ష్యమని, దీనికి ఇతర కార్మిక సంఘాలు కలిసి రావాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీ యూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కార్మికుల సొంతింటి పథ కం కోసం అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కూడా కలువడం జరిగిందని, సింగరేణిలో క్వార్టర్లు కూలిపోయే దశకు చేరుకున్నాయని, అవి కార్మికులకు నివాస యోగ్యంగా కూడా లేవని, డ్రైనేజీ, తాగునీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు. పదవీవిరమణ పొందిన కార్మికునికే ఆ క్వార్టర్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేసిన ట్టు, దీనిపై సింగరేణి యాజమాన్యానికి కూడా నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. సింగ రేణి ప్రాంతంలో ఎక్కడ ఎంత భూమి ఉంది, ఎన్ని క్వార్టర్లు ఉన్నాయి అనే సమా చారాన్ని కూడా ముఖ్యమంత్రికి వివరించిన ట్టు చెప్పారు. సింగరేణిలో గుర్తింపు సంఘ మైన ఏఐటీయూసీ దొడ్డిదారిన కార్మికుల నుంచి బలవంతంగా సభ్యత్వం, గుడి నిర్మా ణాల పేరిట డబ్బులు వసూలు చేయడం సరైంది కాదన్నారు. ప్రతి ఏడాది కార్మికుల నుంచి రూ.1100 చొప్పున రూ.6 కోట్లు గుర్తింపు సంఘం వసూలు చేస్తుందన్నారు. సింగరేణిలో కార్మి కుల సమస్యలు పరిష్కరించడా నికి పైసలు వసూలు చేస్తున్నా రని, నిస్వార్థంగా పని చేయాల్సిన నాయకులే డబ్బులు వసూలు చేస్తే కార్మికులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నిం చారు. సింగరేణిలో విచ్చల విడిగా అవినీతి జరుగుతుందని, దీన్ని అరికట్టాల్సిన నాయకులే ప్రోత్సహిస్తున్నారని విమర్శిం చారు. దొడ్డిదారిన సభ్యత్వం పేరిట వసూ లు చేసిన డబ్బులను వాపసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమా వేశంలో నాయకులు మెండె శ్రీనివాస్‌, రాజ మౌళి, మహేష్‌, గౌస్‌, వేణుగోపాల్‌రెడ్డి, సురేష్‌, నరేష్‌, జనార్ధన్‌, మల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:02 AM