Share News

కేసీఆర్‌ హయాంలో తెలంగాణ సస్యశ్యామలం

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:39 AM

తెలంగాణను సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ కొనియాడారు. కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలో భాగంగా ముందస్తుగా ఆదివారం మండలంలోని రాజేశ్వర్‌రావుపేట గ్రామ శివారులోని పంపు హౌస్‌ వద్ద రైతులు, నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

కేసీఆర్‌ హయాంలో తెలంగాణ సస్యశ్యామలం
కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌

- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌

మెట్‌పల్లి రూరల్‌, ఫిబ్రవరి, 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ కొనియాడారు. కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలో భాగంగా ముందస్తుగా ఆదివారం మండలంలోని రాజేశ్వర్‌రావుపేట గ్రామ శివారులోని పంపు హౌస్‌ వద్ద రైతులు, నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రంలోని వ్యసాయానికి సాగునీరు అందించి సాగు విస్తీర్ణం పెంచి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. రైతు బంధు, బీమా ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలిచి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఇబ్బందులను గురి చేస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా పాలన కొనసాగిస్తుంద ని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకు లు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ పాలన ఓ స్వర్ణయుగం

కథలాపూర్‌ (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ పదేళ్ల పాలన ఓ స్వర్ణయుగం అని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని మండలంలోని భూషణరావుపేట సింగిల్‌విండో కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తు తం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరిట మోసపూరిత హామీలిచ్చి వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిం చారు. రుణమాఫీ, రైతుభరోసా, ఎరువులు సకాలంలో అందక రైతాంగం ఇబ్బందులు పడుతోందన్నారు. రాబోయే కాలంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో కి రావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనే యులు, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ తీట్ల శంకర్‌, రైతు స మన్వయసమితి గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు బద్దం మ హేందర్‌రెడ్డి, జనార్దన్‌, శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:39 AM