ఎల్‌ఆర్‌ఎస్‌పై 25 శాతం రిబేటును సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:48 PM
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 31 లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించినట్లయితే 25 శాతం రిబేటు లభిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సుడా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ 2020 వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు ఎంటర చేస్తే వారి దరఖాస్తుకు సంబంధించి ఫీజు వివరాలు తెలుస్తాయన్నారు.

కరీంనగర్ అర్బన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 31 లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించినట్లయితే 25 శాతం రిబేటు లభిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సుడా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ 2020 వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు ఎంటర చేస్తే వారి దరఖాస్తుకు సంబంధించి ఫీజు వివరాలు తెలుస్తాయన్నారు. జిల్లాలోని కార్పోరేషన్, సుడా, మున్సిపాలిటీలు అన్నీ కలిపి 44,437 దరఖాస్తులకు ఫీజు నిర్ణయించామని తెలిపారు. ఫీజు నిర్ణయించని 1,435 దరఖాస్తులు ప్రోహిబిటెడ్‌లో లేకపోతే మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. పది శాతం ప్లాట్లు అమ్మిన వెంచర్స్‌కు కూడా మిగితా ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ కట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లకు భవిష్యత్తులో ఎలాంటి అనుమతులు ఇవ్వరని, రిజిస్ట్రేషన్‌లు కావని చెప్పారు. దరఖాస్తు దారులకు ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్లు 9652404978, 7093750333కు ఫోన్ చేయవచ్చని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, సీపీవో ఆంజనేయులు, ఫీల్డ్‌ఆఫీసర్లు అజయ్‌రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.