స్వదేశీ మేళాను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:09 AM
స్వదేశీమేళా, ఉద్యోగ్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వినర్ ముక్క హరీష్‌బాబు అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీమేళా, ఉద్యోగ్‌మహోత్సవ్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు.

భగత్‌నగర్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): స్వదేశీమేళా, ఉద్యోగ్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వినర్ ముక్క హరీష్‌బాబు అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీమేళా, ఉద్యోగ్‌మహోత్సవ్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆరు వేల మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 110 కంపెనీలు, వివిధ సంస్థలు ఉద్యోగ స్టాల్స్ ఏర్పాటు చేశాయన్నారు. ఈ నెల 16 వరకు నిర్వహించనున్న స్వదేశీ మేళాను విజయవంతం చేయాలన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో మేళాను నిర్వహిస్తున్నామన్నారు. దేశీయ ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. 210కి పైగా స్టాల్స్ బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. బుధవారం పది గంటల నుంచి ఒంటి గంటవరకు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మేళా కో కన్వినర్ కళ్లెం వాసుదేవరెడ్డి, మాధవరావు, గంప వెంకట్, ఉట్కూరి రాధకృష్ణారెడ్డి, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు.