కంటి లోపాలు ఉంటే శస్త్రచికిత్సలు
ABN , Publish Date - Feb 19 , 2025 | 12:57 AM
కంటి లోపాలు ఉన్న వారికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : కంటి లోపాలు ఉన్న వారికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రాష్ట్రీయ బాల స్వాస్త(ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ కంటి పరీక్షల్లో అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు ఇస్తామన్నారు. కంటీ పరీక్షల్లో లోపాలు ఉన్నవారికి మాత్రం శస్త్రచికిత్సల కోసం పంపిస్తామన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ డాక్టర్ నహిమ, డాక్టర్ కృష్ణవేణి, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి, అనురాధ, ఏఎన్ ఎలు, విద్యార్థులు పాల్గొన్నారు.