Share News

విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కనబరచాలి

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:06 AM

విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కనబ రచాలని జేఎన్టీయూ ప్రిన్స్‌పాల్‌ విష్ణువర్దన్‌ సూచించారు. గురువారం మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీ-జోన్‌ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కనబరచాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్స్‌పాల్‌ విష్ణువర ్ధన్‌

జేఎన్టీయూ ప్రిన్స్‌పాల్‌ విష్ణువర్ధన్‌

రామగిరి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని కనబ రచాలని జేఎన్టీయూ ప్రిన్స్‌పాల్‌ విష్ణువర్దన్‌ సూచించారు. గురువారం మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీ-జోన్‌ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, జిల్లాలకు చెందిన 12 టీంలు టోర్నమెంట్‌ పాల్గొంటున్నాయి. తొలుత వివిధ జిల్లా క్రీడాకారులతో ప్రిన్స్‌పాల్‌ పరిచయం చేసుకున్నారు.

- సెమీ ఫైనల్‌లో మంథని జేఎన్‌టీయూ...

తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోను మంథని జేఎన్‌టీయు గెలిచి మొదటి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ట్రినిటి, కొత్తగూడెం జట్లతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మంథని జేఎన్‌టీయూ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు విజేతలకు ప్రిన్స్‌పాల్‌ విష్ణువర్ధన్‌, ఆడ్రియాల ప్రాజెక్టు అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పింగిళి కృష్ణారెడ్డి, లైబ్రరీ ఇన్‌చార్జి రమణ, పరిపాలనాధికారి సుమన్‌, ఏఈఈ ప్రభాకర్‌, కాంట్రాక్టర్‌ శ్రావణ్‌, పీడీ సునీల్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 01:06 AM