ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 21 , 2025 | 02:43 AM
కరీంనగర్, ఆదిలాబాద్, నిజా మాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి లోపాలు, తప్పులు జరుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్, ఆదిలాబాద్, నిజా మాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి లోపాలు, తప్పులు జరుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసి న స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యా యుల, పట్టభద్రుల బ్యాలెట్ బాక్సులను వేర్వేరుగా ఏర్పాటు చేసి, విభజన స్పష్టంగా ఉండాలని అన్నారు. పోలీసు బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీ సు అధికారులతో చర్చించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో గటి ్ట బందో బస్తు ఏర్పాటు చేయాలని, అన్ని వైపులా సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. 24 గంటల పాటు ఫైరింజన్ అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు పంపించే ప్రతి బ్యాలెట్ బాక్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి లాక్ సిస్టమ్ సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వర కు ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.