దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:59 AM
సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరి ష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యనియన్ నాయకులు సీఎండీ బలరాంను కోరారు.

యైుటింక్లయిన్‌కాలనీ, జనవరి 3 (ఆంధ్ర జ్యోతి): సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరి ష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యనియన్ నాయకులు సీఎండీ బలరాంను కోరారు. శుక్రవారం సింగరేణి భవన్‌లో సీఎండీని కలిసిన సీఐటీయూ బృందం పెండింగ్ అంశాలను ప్రస్తావించారు. సొంత ఇంటి పథకం అమలు అల వెన్స్‌లపై ఐటీ రీయింబర్స్ చేయడం, మారు పేర్ల సమస్యలు ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. కాగా సొంత ఇంటి పథకాన్ని సంస్థకు అదనపు భారం కాకుండా అమలు జరిపే విధానాన్ని వారు వివరించారు. పెర్క్స్‌పై ఐటీ రీయింబర్స్, మారు పేర్ల సమస్యలను స్ట్రక్చర్ సమావేశాల్లో గుర్తింపు ప్రాతి నిధ్య సంఘాలు ప్రస్తా విస్తే త్వరగా అయ్యే అవకాశం ఉండేదని సీఎండీ పేర్కొ న్నారు. సీఎండీని కలి సిన వారిలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ కుం ట ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ రాంప్రసాద్, సంపత్‌కుమార్ ఉన్నారు.