సిరిసిల్ల పట్టణంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలి
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:50 AM
చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని నేతన్నలకు అందుబాటులో ఉండేలా సిరిసిల్ల పట్టణంలోనే కొనసాగించాలని సీఐటీయూ తెలంగాణ పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల రూరల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని నేతన్నలకు అందుబాటులో ఉండేలా సిరిసిల్ల పట్టణంలోనే కొనసాగించాలని సీఐటీయూ తెలంగాణ పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని క్రామోడ్ అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని కార్మిక క్షేత్రమైన బీవైనగర్ లో చాలా సంవత్సరాల నుంచి చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నేతన్నలకు సేవల ను అందిస్తుందన్నారు. ఈ కార్యాలయాన్ని జిల్లా సమీకృత కలెక్టరేట్‌కు సమార్చడం సరైన విధానం కాదని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభు త్వం వెంటనే వెనక్కి తీసుకుని సిరిసిల్ల బీవై నగర్‌లోనే చేనేత జౌళిశాఖ కార్యాలయాన్ని యథా విధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పవర్ లూం, అనుబంధ రంగాల కార్మికులకు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ పథకాల కోసం కూలీ కోసం తరచుగా కార్మికులు చేనేత జౌళిశాఖ కార్యాల యాన్ని వెళ్లివలసి ఉంటుందని అన్నారు. కార్మికు లందరికి అందుబాటులో ఉన్న కార్యాలయాన్ని కలెక్టరేట్‌కు మార్చడం వలన జిల్లా కలెక్టరేట్ పట్టణానికి దూరంగా ఉండడంతో కార్మికులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని పట్టణానికి దూరంగా ఉన్న కలెక్టరేట్‌కు తరలించడం సరైందని కాదని ప్రస్తుతం ఉన్న కార్యాలయంలోనే కొనసాగించాల ని లేకుంటే కార్మికులతో పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలను చేపట్టి పోరాటాలను నిర్వహి స్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అఽధ్యక్షుడు కోడం రమణ, నాయకులు నక్క దేవదాస్, సిరి మల్ల సత్యం, బింగి సంపత్, గడ్డం రాజశేఖర్ తది తరులు పాల్గొన్నారు.