sircilla : సాగు లెక్కకు ‘డిజిటల్ సర్వే’
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:49 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) సమృద్ధిగా వర్షాలు కురియడంతో నీటి లభ్యత ఆశతో యాసంగి పంటల సాగు వైపు రైతులు ముందడుగు వేశారు. జోరుగా వరినాట్లను పూర్తి చేసుకున్నారు.

- జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా 52 క్టస్టర్లలో పంట లెక్కలు
- జిల్లాలో 1.43 లక్షల రైతులు.. 95,449 ఎకరాల్లో పంట పరిశీలన
- ఇప్పటివరకు 32,707 ఎకరాల్లో సర్వే
- యాసంగిలో 1.80లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
- వరి 1.76లక్షల ఎకరాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సమృద్ధిగా వర్షాలు కురియడంతో నీటి లభ్యత ఆశతో యాసంగి పంటల సాగు వైపు రైతులు ముందడుగు వేశారు. జోరుగా వరినాట్లను పూర్తి చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఆశాజనకంగానే భూగర్భ జలాలు ఉంటాయని రైతులు వరిసాగు వైపు మొగ్గు చూపారు. జిల్లాలో 1.76 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కూలీల కొరత ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన కూలీలతో నాట్లను పూర్తి చేసుకున్నారు. గతంలో ప్రభుత్వం క్రాప్ బుకింగ్ ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం యాసంగిలో పంటల సాగు వివరాలు ఖచ్చితంగా ఉండే విధంగా డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభించింది.
ఫ జిల్లా వ్యాప్తంగా 95,449 ఎకరాల్లో సర్వే..
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్‌గా 52 క్లస్టర్లలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం మండల విస్తరణ అధికారులతో సర్వేను చేస్తోంది. వివిధ పంటల సాగు వివరాలను ఫోన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. పంటల నమోదు ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూర్చే దిశగానే కేంద్రం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విధానాన్ని తీసుకవచ్చింది. ఇందులో భాగంగానే డిజిటల్ సర్వే కొనసాగుతున్నా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పంటల బీమాతో పాటు ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్న సమయంలో డిజిటల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ సర్వేలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1,43,936 మంది రైతులకు సంబంధించి 95,443 ఎకరాల్లో సర్వే చేసే విధంగా లక్ష్యంగా పెట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు 39,855 మంది రైతులకు సంబంధించి 32,707 ఎకరాల్లో సర్వే చేశారు. డిజిటల్ సర్వేలో గంభీరావుపేట మండలంలో గంభీరావుపేటలో 5,002 మంది రైతులు 2,094 ఎకరాలు, లింగన్నపేటలో 4,067 మంది రైతులు 2,089 ఎకరాలు, నర్మాలలో 5,106 మంది రైతులు 2,098 ఎకరాలు, సముద్రలింగాపూర్‌లో 3,168 మంది రైతులు 2,099 ఎకరాలు, ఇల్లంతకుంట మండలంలో దాచారంలో 2,015మంది రైతులు 1,854 ఎకరాలు, ఇల్లంతకుంటలో 2,414మంది రైతులు 1,842 ఎకరాలు, గాలిపెల్లిలో 2,543మంది రైతులు 1,838 ఎకరాలు, పెద్దలింగాపూర్‌లో 3,379 మంది రైతులు 1,832 ఎకరాలు, పొత్తూర్‌లో 2,902 మంది రైతులు 1,847 ఎకరాలు, రేపాకలో 3,669 మంది రైతులు 2,098 ఎకరాలు, వల్లంపట్లలో 3,235 మంది రైతులు, 1,841 ఎకరాలు, ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో 3,079 మంది రైతులు 1,851 ఎకరాలు, బందనకల్‌లో 2,719 మంది రైతులు 2,099 ఎకరాలు, చీకోడులో 3,125 మంది రైతులు 2,089 ఎకరాలు, మద్దికుంటలో 1,880 మంది రైతులు 1,849 ఎకరాలు, ముస్తాబాద్‌లో 2,733 మంది రైతులు 1,848 ఎకరాలు, నామాపూర్‌లో 2,446 మంది రైతులు 1,849 ఎకరాలు, సిరిసిల్ల అర్బన్ మండలంలో బోనాలలో 2,900 మంది రైతులు 2,099 ఎకరాలు, సిరిసిల్లలో 3,822 మంది రైతులు 1,852 రైతులు, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో 3,501 మంది రైతులు 2,100 ఎకరాలు, జిల్లెల్లలో 3,326 మంది రైతులు, 1,848 ఎకరాలు, కస్బెకట్కూర్‌లో 2,531 మంది రైతులు 1,839 ఎకరాలు, నేరేళ్లలో 2,657 మంది రైతులు 1,843 ఎకరాలు, తాడూర్‌లో 3,148 మంది రైతులు 2,097 ఎకరాలు, తంగళ్లపలిలో 4,005 మంది రైతులు 2,094 ఎకరాలు, వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో 2,933 మంది రైతులు 2,103 ఎకరాలు, వీర్నపల్లిలో 2,684 మంది రైతులు 2,099 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో 2,336 మంది రైతులు, 1,849 ఎకరాలు, గొల్లపల్లిలో 2,737 మంది రైతులు, 2,094 ఎకరాలు, వెంకటాపూర్‌లో 3,842 మంది రైతులు 1,846 ఎకరాలు, బోయినపల్లి మండలం కొదురుపాకలో 3,125 మంది రైతులు 1,845 ఎకరాలు, బోయినపల్లి 2,816 మంది రైతులు, 1,849 ఎకరాలు, కోరెంలో 3,657 మంది రైతులు 2,091 ఎకరాలు, విలాసాగర్‌లో 2,857 మంది రైతులు 1,839 ఎకరాలు, చందుర్తి మండలం బండపల్లిలో 2,231 మంది రైతులు 1,843 ఎకరాలు, మల్యాలలో 1,748 మంది రైతులు 2,085 ఎకరాలు, మర్రిగడ్డలో 2,352 మంది రైతులు 2,098 ఎకరాలు, కోనరావుపేట మండలం బావుసాయిపేటలో 2,565 మంది రైతులు 1,843 ఎకరాలు, కొలనూర్‌లో 2,637 మంది రైతులు 2,097 ఎకరాలు, కోనరావుపేటలో 3,060 మంది రైతులు 2,096 ఎకరాలు, నిమ్మపల్లిలో 2,077 మంది రైతులు 1,847 ఎకరాలు, నిజామాబాద్‌లో 2,211 మంది రైతులు 1,848 ఎకరాలు, సుద్దాలలో 2,775 మంది రైతులు 1,847 ఎకరాలు, రుద్రంగి మండలం మానాలలో 1,381 మంది రైతులు 1,353 ఎకరాలు, వేములవాడ మండలం నాంపల్లిలో 3,077 మంది రైతులు 2,095 ఎకరాలు, శాత్రాజుపల్లిలో 2,688 మంది రైతులు 2,094 ఎకరాలు, వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో 2,908 మంది రైతులు 1,847 ఎకరాలు, మర్రిపల్లిలో 3,752 మంది రైతులు 1,850 ఎకరాలు, వట్టెంలలో 2,075 మంది రైతులు 2,093 ఎకరాల్లో సర్వే చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన లెక్కల ప్రకారం క్లస్టర్‌లలో అధికారులు సర్వే చేస్తున్నారు.
ఫ నెట్‌వర్క్‌తో ఇబ్బందులు..
గ్రామీణ ప్రాంతాల్లో పంటపొలాల వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఫోన్ యాప్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో సాంకేతిక సమస్యలతో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇబ్బందులు పడడం కనిపిస్తోంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మారుమూల ప్రాంతాలకు వెళ్లడం ద్వారా నెట్‌వర్క్ కవరేజీ లేకపోవడంతో సర్వే నంబర్ వద్ద పంటల వివరాలు నమోదు చేసి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సర్వే వేగంగా జరగడం లేదు.
ఫ వరివైపే మొగ్గు..
జిల్లాలో యాసంగిలో వరివైపే రైతులు మొగ్గు చూపారు. 1.80లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 1.76 లక్షల వరకు వరిసాగు చేసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన లెక్క ప్రకారం గంభీరావుపేటలో 18వేల ఎకరాలు, ఇల్లంతకుంటలో 26,124 వేల ఎకరాలు, ముస్తాబాద్‌లో 20,006 వేల ఎకరాలు, సిరిసిల్లలో 3,803 ఎకరాలు, తంగళ్లపల్లిలో 18,060 ఎకరాలు, వీర్నపల్లిలో 6,520 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 16,359 ఎకరాలు, బోయినపల్లిలో 12,510 ఎకరాలు, చందుర్తిలో 16,545 ఎకరాలు, కోనరావుపేటలో 17,806 ఎకరాలు, రుద్రంగిలో 4,850 ఎకరాలు, వేములవాడలో 2,500 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 9,500 ఎకరాల వరకు వరిసాగు చేశారు. దీంతో పాటు మొక్కజొన్న 1,491 ఎకరాలు, గోదుఽమ 50 ఎకరాలు, కందులు 180 ఎకరాలు, పల్లి 25 ఎకరాలు, నువ్వులు 134 ఎకరాలు, పొద్దు తిరుగుడు 1,021 ఎకరాల వరకు సాగు చేశారు.