విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:51 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

పెద్దపల్లి కల్చరల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ని సమావేశ మందిరంలో సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష కార్యక్రమాన్ని సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సావిత్రీబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చిందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలం నుంచి ఒక మహిళా ఉపాధ్యాయురాలిని ఎంపి కచేసి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. బాలికల విద్య కోసం సావిత్రీబాయి పూలే కృషి చేశారని, దేశంలో మొట్టమొదటిసారిగా మహి ళల విద్యకోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారం భించారన్నారు. సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్ర భుత్వ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయుల ను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధ వి, జిల్లా సమగ్రశిక్ష సమన్వయకర్త పీఎం షేక్, అధికారులు పాల్గొన్నారు.