Share News

సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:43 AM

బ్యాంకు లు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రత ప్రమాణా లు పాటించాలని, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గా ర్డులను ఏర్పాటుచేసుకోవాలని రామగుండం సీపీ ఎం శ్రీనివాస్‌ సూచించారు.

సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి

కోల్‌సిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): బ్యాంకు లు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రత ప్రమాణా లు పాటించాలని, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గా ర్డులను ఏర్పాటుచేసుకోవాలని రామగుండం సీపీ ఎం శ్రీనివాస్‌ సూచించారు. శుక్రవారం కమిషన రేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ వ్యాప్తంగా ఉన్న ఏసీపీలు, వివిధ బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి పెద్దపల్లి జోన్‌లో 109 బ్యాంకులు, 79ఏటీఎంలు, మంచిర్యాల జోన్‌ పరిధిలో 109బ్యాంకులు, 89ఏటీఎం సెంటర్లు ఉన్నాయని, బ్యాం కులు, ఏటీఎంల వద్ద భద్రత ప్రమాణాలు పాటించాల ని సూచించారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఖచ్చితంగా నియమించాలని, బ్యాంకు అధికారులు ఏ ర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో నాణ్యత లోపం ఉందని, హై ఫ్రీక్వెన్సీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అలారం సిస్టం కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దోపిడీ సమయంలో సిబ్బంది ఎలా ప్రతి స్పందించాలి, దానిపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. బ్యాంకు లోపలికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేయడానికి డ్యూటీలో ఒక గార్డుతో పాటు ప్రవేశం ద్వారం వద్ద డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌, హ్యాండ్‌ హెల్డ్‌ మెటల్‌డిటెక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్‌ను బ్యాంకు లేదా సెక్యూరిటీ ఏజెన్సీ నియమించినప్పటికీ అతడి వ్యక్తిగత సమాచారం, పూర్తి బయోడేటా ఉండాలన్నారు. కొత్తగా నియమితు లైనవారు, తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన వారి తో బ్యాంకు అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. చాలా నేరాల్లో నిందితులు సీసీ కెమెరాలపై స్ర్పే చేసి సీసీ కెమెరాలు పని చేయకుండా చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా డీవీఆర్‌లను కూడా దొంగిలించుకువెళ్లి వాటిని ధ్వంసం చేస్తున్నారని, డీవీ ఆర్‌లను రహస్య ప్రదేశంలో ఉంచాలని, ఆయుధాల ఉపయోగంపై సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఏటీఎంలో డబ్బు లు ఫిల్లింగ్‌ చేసే సమయంలో స్థానిక పోలీస్‌ అధికారు లకు, సిబ్బందికి సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో బ్లూ క్లోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తారన్నారు. ప్రతి బ్యాంకులో పోలీస్‌ స్టేషన్లు, హెల్ప్‌లైన్‌ నంబర్లు పెద్ద అక్షరాలతో ప్రదర్శించాలని, దొంగలు ఎక్కువగా బ్యాంకులను తెరిచినప్పుడు లేదా మూసివేసే సమ యంలో, భోజన విరామసమయంలో లక్ష్యం చేసు కుని దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, ఏసీపీలు మడత రమేష్‌, గజ్జి కృష్ణ, ఆరె వెంకటే శ్వర్లు, ఆర్‌ ప్రకాష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహులు, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్ర రావు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:43 AM