Share News

రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలి

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:09 AM

ప్రాథమిక అరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో గత 18సంవత్సరాలుగా రెండవ ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్‌చేసి, ఉద్యోగభద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు డిమాండ్‌ చేశారు.

రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక అరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో గత 18సంవత్సరాలుగా రెండవ ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్‌చేసి, ఉద్యోగభద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ ఎదుట గురువారం ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెండో ఏఎన్‌ఎంల యూనియన్‌ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ రెగ్యులర్‌ ఏఎన్‌ఎం పోస్టులను నింపేందుకు అనేక సంవత్సరాల తరువాత నోటిఫికేషన్‌ చేసినందున రెండో ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారిని అందులో భర్తీ చేయాలని కోరారు. రెండో ఏఎన్‌ఎంలకు రూ. పది లక్షల లైఫ్‌టైమ్‌ గ్రాట్యూటీ,రూ.10లక్షల హెల్త్‌, యాక్సి డెంట్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వడంతో ఏడునెలల పీఅర్సీ ఏరియర్స్‌ వేతనం ఇవ్వడంతో పాటు బదిలీలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, రెండో ఏఎన్‌ఎం సంఘం నాయకురాలు స్వప్నదేవి, వినోద, మంజుల, సరి త, పుష్పలత, రాజేశ్వరి, పూజిత, సువర్ణ, భార తి, అమృతదేవి, సుజాత, పద్మ, శ్యామల, రత్త మ్మ, రజని, ఇందిర, అరుణ, రేణుక, వసంత, శ్రావణి, రహీంసుల్తానా, స్వప్న, స్వరూప, సు మతి, రాజేశ్వరి, మమతలు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 01:09 AM