ఘనంగా మాజీ మంత్రి పాటి రాజం జయంతి
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:57 AM
గంభీ రావుపేట మండల కేంద్రంలో శనివారం దివంగత మాజీ మంత్రి పాటిరాజం జయంతిని ఘనంగా నిర్వహించారు.
గంభీరావుపేట, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): గంభీ రావుపేట మండల కేంద్రంలో శనివారం దివంగత మాజీ మంత్రి పాటిరాజం జయంతిని ఘనంగా నిర్వహించారు. పాటి రాజం విగ్రహానికి పూలమాల లు వేసి, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ నీటిపారుదల, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసి గంభీరావుపేట మండలాన్ని విద్యాపరంగా, వైద్యపరంగా రవాణా పరంగా అభివృద్ధి చేసిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. పాటి రాజం సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాటి రాజం విగ్రహ ఆవిష్కరణ కోకన్వీనర్ మల్యాల రాజవీర్, పాటి శకుంతల, ఏఎంంసీ డైరెక్టర్లు ఎడబో యిన ప్రభాకర్, భూక్య విఠల్, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసె ల చంద్రం, రాష్ట్ర నాయకులు దోశ ల ఉపేందర్, నర్మల గ్రామ మాజీ సర్పంచ్ ఎడబోయిన రాజు, మాజీ వార్డు సభ్యులు బండ రమే ష్, రెడ్డి మాల రాజనర్సు, ప్రతిభ వికాస్ బాబు, మాజీ వైస్ ఎంపీపీ లతా రాజు, నాయకులు లక్కం నాంపల్లి, లక్కం బాబు, తుమ్మల మల్లయ్య, నాందేడ్ అనిల్, బరిగేల జీవన్, వేషాల ఎంకటి, చిట్టెంపల్లి రాజయ్య, బాబురావు, ఎల్లె బాల కృష్ణ, నల్ల రాజకుమార్, చేరిపల్లి భాను ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.